ఉదయగిరిలో ఎమ్మెల్యే కుమారుడు విస్తృత పర్యటన

50చూసినవారు
ఉదయగిరి మండలంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తనయుడు కాకర్ల సంహిత్ శుక్రవారం విస్తృత పర్యటన చేశారు. ఉదయగిరి మండలంలోని తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు షేక్ రియాజ్ కు సంబంధించిన కుటుంబీకుడు అమెరికాలో చనిపోగా వారి ఇంటికి వచ్చిన కాకర్ల సంహిత్ వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. రెండు రోజుల క్రితమ అమెరికా నుంచి వచ్చిన సంహిత్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేస్తూ అందరిని కలుస్తున్నారు.

సంబంధిత పోస్ట్