విద్యుత్ దీపాలతో అలంకరించిన ఎంపీడీవో కార్యాలయం

72చూసినవారు
విద్యుత్ దీపాలతో అలంకరించిన ఎంపీడీవో కార్యాలయం
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు దీపాలతో అలంకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరికుంటపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. రంగురంగులుగా ఎంపీడీవో కార్యాలయం దర్శనం ఇస్తుండడంతో పలువురు ఆ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లో బంధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్