ఉదయగిరి మండలంలోని 12 సచివాలయాల పరిధిలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరు ఎన్పీసీఐ లింకును చేసుకోవాలని ఎంపీడీవో అప్పాజీ తెలిపారు. ఈ ఎన్పిసిఐ చేసుకోవడం వల్ల ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను ఎటువంటి అంతరాయం లేకుండా లభిస్తాయని తెలిపారు. మండలంలో ఎక్కువ శాతం వలస వెళ్లి ఉండడంతో ప్రజలు గమనించి ఎన్పీసీఐ లింకు చేసుకోవాలని కోరారు. సచివాలయ సిబ్బంది ఇంటి సర్వే చేసే క్రమంలో సహకరించాలని కోరారు.