ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఓవైపు భారీ వర్షం మరోవైపు కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగడానికి నీరు లేక అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అరగంటైనా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు.