అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉదయగిరి ఎస్సై కర్ణాటీ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఉదయగిరి రంగనాయకుల దేవాలయం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ఎందరో అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని ఈ సందర్భంగా ఎస్సై అన్నారు. అనంతరం అమరవీరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.