బాణసంచా విక్రయాలపై ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి సూచనలు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా లైసెన్స్ ఉన్న వారే బాణసంచా విక్రయించాలని ఆయన తెలిపారు. పట్టణ సమీపంలో బాణసంచా విక్రయాలు జరపవద్దని, నీరు, ఇసుక అగ్నిమాపక సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రమాదాలు సంభవిస్తే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి అన్నారు. అనుమతులు లేకుండా టపాసులు నిలువలు చేసినా, విక్రయించిన చర్యలు తప్పవన్నారు.