ఉదయగిరిలో డయాలిస్ సెంటర్ ఏర్పాటు కోసం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ నీరు వల్ల డయాలసిస్ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రికి తెలియజేయడంతో, మరో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి వాగ్దానం చేశారని పేర్కొన్నారు. అలాగే, వంద పడకల ఆసుపత్రి స్థాపనపై కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు.