సొంత మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించిన కాకర్ల సురేష్
ఎన్నికల పర్యటనలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గురువారం కలిగిరి మండలం తెల్లపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో తనను ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిపించాలని కాకర్ల సురేష్ ప్రజలను అభ్యర్థించారు. అనంతరం తన సొంత మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు.