వరికుంటపాడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

61చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వరికుంటపాడు మండల కేంద్రంలో పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు.

సంబంధిత పోస్ట్