కలకలం రేపిన సూసైడ్ సెల్ఫీ వీడియో

21351చూసినవారు
వెంకటగిరి మండల పరిధిలోని కోనమల్లేశ్వరస్వామి కోనకు వెళ్లే అటవీ ప్రాంతంలో శుక్రవారం ఓ యువకుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపి కలకలం సృష్టించాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంకటగిరి ఎస్ఐ సుధాకరరెడ్డి హుటాహుటిన సిబ్బందినితో సంఘటన స్థలానికి చేరుకొని యువకుడుని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్