ఎమ్మెల్యేగా రామకృష్ణను, ఎంపీగా వరప్రసాద్ ను గెలిపించండి

53చూసినవారు
ఎమ్మెల్యేగా రామకృష్ణను, ఎంపీగా వరప్రసాద్ ను గెలిపించండి
వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరులో శనివారం ఎమ్మెల్యే అభ్యర్ధి కురుగొండ్ల రామకృష్ణతో కలసి నందమూరి బాలకృష్ణ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో బాలకృష్ణ మాట్లడుతూ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆల్తూరుపాడు రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, వెంకటగిరి పట్టణంలో మూతపడిన ఘోషా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మారుస్తామని తెలిపారు. ఎమ్మెల్యేగా రామకృష్ణను, ఎంపీగా వరప్రసాద్ ను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్