ఏపీలో ఆ ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు!

57చూసినవారు
ఏపీలో ఆ ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు!
ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విమానాశ్రయాలకు తోడు మరో ఏడు ఎయిర్‌పోర్టులు నిర్మించాలని అనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, పుట్టపర్తి సహా ఏడు చోట్ల విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఆయ‌న‌ వెల్లడించారు. రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలు, స్థలాన్ని పరిశీలించాల్సి ఉందన్నారు. స్థలం అందుబాటులో ఉంటే ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్