ఏపీ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న హౌసింగ్ కాలనీలోని ఇళ్లను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి పార్థసారథి తెలిపారు. పేరేచర్ల హౌసింగ్ కాలనీలో మొత్తం 18 వేలకు గాను 11 వేల ఇళ్ల నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై సీఎం చంద్రబాబు విజిలెన్స్ విచారణ వేశారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.