అమరావతి నిధులపై తెలుగులో వివరణ ఇచ్చిన నిర్మలమ్మ

54చూసినవారు
అమరావతి నిధులపై తెలుగులో వివరణ ఇచ్చిన నిర్మలమ్మ
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన నిధులపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలుగులో వివరణ ఇచ్చారు. ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలని విభజన చట్టంలో ఉందని తెలిపారు. ఇవాళ బడ్జెట్‌లో అమరావతికి ప్రకటించిన రూ.15 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్