AP: ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) బారిన పడి ఆదివారం మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందించారు. ‘బీజీఎస్ అంటువ్యాధి కాదు. ఈ వ్యాధికి అన్ని ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. జీబీఎస్‌పై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.’ అని మంత్రి అన్నారు.