కొత్త వైరస్‌పై ఆందోళన వద్దు: ఏపీ వైద్యారోగ్య శాఖ

81చూసినవారు
కొత్త వైరస్‌పై ఆందోళన వద్దు: ఏపీ వైద్యారోగ్య శాఖ
AP: చైనాలో విస్తరిస్తున్న కొత్త వైరస్‌పై రాష్ట్ర ప్రజలు అందోళన చెందవద్దని ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఏపీలో అలాంటి వైరస్ కేసులు నమోదు కాలేదని, ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామని కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పద్మావతి అన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించవద్దని, అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. గొంతులో నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్