ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, గ్రామస్థాయి పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను మర్చిపోలేమని సీఎం చంద్రబాబు అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని, కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.