వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు

72చూసినవారు
AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్‌పై చెప్పు చూపిస్తూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నేతలు ఫిర్యాదు చేయగా.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తనను, మాధురిని జనసేన నేతలు దుర్భాషలాడారని దువ్వాడ తెలిపారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని పోలీసులను ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్