ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. సముద్రం మీదుగా దూసుకెళ్తున్న డేగ తన కాళ్లతో సింహాన్ని గట్టిగా పట్టుకుని లాక్కెళ్తోంది. సింహమేమో దాన్నుంచి విడిపించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. చూస్తుండగానే ఆ డేగ.. సింహాన్ని కోడి పిల్లలా ఎగరేసుకెళ్లింది. అయితే ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు సింహం చాలా బరువుంటుంది, దాన్ని ఎత్తుకెళ్లడం అసాధ్యమంటూ కామెంట్ చేస్తున్నారు.