ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్ విచారణ ముగిసింది. రెండు రోజుల పాటు ఆయనను ఎస్పీ దామోదర్ విచారించారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు విజయపాల్ సహకరించలేదని చెబుతున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ జరిగింది. విచారణ ముగియడంతో గుంటూరు జైలుకి విజయ్‌పాల్‌ను తరలించారు.