ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. ఓ వ్యక్తి దారుణ హత్య

70చూసినవారు
ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం.. ఓ వ్యక్తి దారుణ హత్య
ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఏపీలోని ఏలూరులో జరిగింది. ఏలూరులోని ముదినేపల్లి మండలం వూరుకూరు గ్రామంలో బాలకోటయ్యను కత్తులతో నరికి చంపారు ప్రత్యర్ధులు. మే నెలలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను గ్రామంలో పెట్టిన సందర్భంలో కొంద‌రితో బాల‌కోట‌య్యకు వివాదం జ‌రిగింది. ఆ కక్షల కారణంగా బాలకోటయ్యను హత్య చేసినట్టు భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదం కారణంగానే హత్య జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్