పర్యావరణ హితం కోరుతూ మట్టి వినాయకులను అందరూ ప్రతిష్టిస్తున్నారు. మట్టితో తయారు చేసిన ఉగ్ర నరసింహ స్వామి రూపంలో ఉన్న వినాయకుడి విగ్రహం అందరిని ఆకట్టుకుంటుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ ఉగ్ర నరసింహ స్వామి రూపంలో వినాయకుడి రూపొందించారు. కొండవీటి ప్రాంతంలో శ్రీ బాలవినాయక యువక మండలి ఆధ్వర్యంలో ఈ వినాయకుడి ఉత్సవాలు జరుగుతున్నాయి.