AP: నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా సినీ రంగంలో ఆయన ప్రస్థానం, రాజకీయ రంగంలో, పేదల జీవితాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలను స్మరించుకుంటున్నానని పవన్ పేర్కొన్నారు. ఆయన నట జీవితం, రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం, ఆచరణీయమని పవన్ తెలిపారు.