రాష్ట్రంలో శ్రీభక్త కనకదాసు జయంతి వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జాతీయ సంగోలి రామన్న సేవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిన కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కర్నూలులో ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసి కనకదాసు జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జాతీయ సంగోలి రామన్న సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.