గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గంపలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు సతీమణి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన తునికేపాడు గ్రామాల్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజేశ్వరరావు సతీమణికి పలువురు ఘన నివాళి అర్పించారు. అనంతరం పరామర్శించారు.