వైసిపి పార్టీ గెలుపుకు కార్యకర్తలే మహాబలమని తిరువూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ అన్నారు. శనివారం ఉదయం నియోజకవర్గ పరిధిలో గల తిరువూరు మండలం జి. కొత్తూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి స్వామి దాస్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.