గొల్లపూడి రామాలయం వద్ద అన్నదానం

55చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక గొల్లపూడి పంచాయతీ ఆఫీస్ వద్ద ఉన్న రాముల వారి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం12గంటల నుండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మూడు రోజులపాటు జరిగిన పూజా కార్యక్రమంలో భాగంగా నేడు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్