విజయవాడ: మమ్మల్ని క్షమించండి.. శ్రీ రెడ్డి
విజయవాడ: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు అరెస్టులు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్త శ్రీరెడ్డి స్పందించారు. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్, వారి కుటుంబ సభ్యులను క్షమించాలని కోరారు. తాను పోస్టులు పెట్టిన విషయాన్ని ఒప్పుకుని, వైసీపీ కార్యకర్తలను కూడా క్షమించాలని విజ్ఞప్తి చేశారు. "రాజకీయ యుద్ధం నేతల మధ్య ఉండాలి, కార్యకర్తలను వదలిపెట్టండి" అని ఆమె అన్నారు.