రాష్ట్ర వ్యాప్తంగా నున్న పెట్రోలు బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరారు. బుధవారం హెపిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ చమురుపరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల అవగాహనా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.