పుచ్చకాయ పంట గురించి చాలా మంది రైతులకు సుపరిచితమే, అయితే పంట నుండి మంచి లాభాలు పొంది, ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి గింజలు లేని పుచ్చకాయను సాగు చెయ్యడం మంచిదని శాస్తవేత్తలు చెబుతున్నారు. ఈ సీడ్‌లెస్ పుచ్చ పంట రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే చక్కటి పంట. ఎకరానికి రూ.50 వేల ఖర్చు పెడితే చాలు నాలుగు నెలల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.1.2 లక్షల వరకు ఆదారం తెచ్చిపెడుతుందని శాస్తవేత్తలు సూచిస్తున్నారు.