విజయవాడలో వరదల నేపథ్యంలో నగరమంతా బురదతో నిండిపోయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి రహదారులు, ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. వందల సంఖ్యలోని ఫైర్ ఇంజిన్లు విజయవాడకు చేరుకుని ఇళ్లు, షాపులు, రోడ్లను క్లీన్ చేస్తున్నాయి. శుభ్రం చేసేందుకు నీటి సరఫరా చేసేలా నీటి ట్యాంకర్లు నగరంలో బారులు తీరాయి.