ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు అవకాశం: మంత్రి లోకేశ్

83చూసినవారు
ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు అవకాశం: మంత్రి లోకేశ్
AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో అభ్యర్థుల ప్రకటనపై మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి.. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటాం' అని లోకేశ్ చెప్పారు. యువమహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్