ఏపీలో ఇందన పాలసీ-2024 విధివిధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు శుద్ధ ఇంధన పాలసీ అమల్లో ఉంటుందని పేర్కొంది. ట్రెండ్స్, టెక్నాలజీ, ట్రాన్స్‌ఫర్మేషన్, ట్రేడ్ విధానాన్ని అమలు చేయాలని నిర్నయించినట్లు వెల్లడించింది. 38,500 మెగావాట్ల సౌర, 74900 పవన, 43890 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టులను ఐదేళ్లలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.