తొలుత 35.. రీకౌంటింగ్‌లో 89 మార్కులు

58చూసినవారు
తొలుత 35.. రీకౌంటింగ్‌లో 89 మార్కులు
ఏపీ పది పరీక్షల మూల్యాంకనంలో ఎవాల్యుయేటర్ల తప్పులు బయటికొస్తున్నాయి. చిత్తూరులో ఉర్జిత్ అనే విద్యార్థికి తెలుగులో 95, సైన్స్‌లో 90, సోషల్‌లో 85, ఇంగ్లీష్‌లో 98 మార్కులు రాగా, హిందీలో 35 మాత్రమే వచ్చాయి. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయగా తాజా ఫలితాల్లో హిందీలో 89 మార్కులు వచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన మార్కుల విషయంలో ఎవాల్యుయేటర్లు బాధ్యతగా ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్