రేపు కేర్ టేకర్ పోస్టులకు ఇంటర్వ్యూలు

54చూసినవారు
రేపు కేర్ టేకర్ పోస్టులకు ఇంటర్వ్యూలు
గుంటూరు సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలకు అనుబంధంగా ఉన్న విద్యార్థినుల వసతి గృహంలో కేర్ టేకర్ పోస్టులకు ఈనెల 27న ఉదయం10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జ్యోత్స్నకుమారి శుక్రవారం తెలిపారు. డిగ్రీ ఆపైన విద్యార్హతలుకలిగి అవివాహితులైన మహిళా అభ్యర్థినులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థినులు వసతి గృహంలోనే ఉండాలని, వేతనంతో పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్