ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాచర్ల ఏడీఎ జగదీశ్వరరెడ్డి ప్రకటించారు. బుధవారం రెంటచింతల స్థానిక ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అధిక ధరలకు కొన్న రైతులకు ఫిర్యాదు చేస్తే వ్యాపారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలోని పలు గ్రామాలలోని రైతు భరోసా కేంద్రాలలో 120 టన్నుల యూరియా, 80 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 50 టన్నుల డీఏపీ సిద్ధంగా ఉన్నాయి.