మాచర్ల: నాగార్జున సాగర్ 16 క్రస్ట్ గేట్ల నుంచి నీటి విడుదల

82చూసినవారు
మాచర్ల మండలం నాగార్జున సాగర్ 16 క్రస్ట్ గేట్ల నుంచి మంగళవారం ప్రాజెక్ట్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం వరకు 20 గేట్ల నుంచి నీటిని విడుదల చేసిన అధికారులు 4 గేట్లను తగ్గించి నేటి ఉదయం నుంచి 16 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి సాగర్ ప్రాజెక్టుకు 1. 74 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుత నీటి మట్టం 588. 70 అడుగులు ఇది 308. 17 టీఎంసీలకు సమానం.

సంబంధిత పోస్ట్