రొంపిచర్ల సెక్టార్ పరిధిలోగల ఆరేపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ నందు పౌష్టికాహారమాసోత్సవాల సందర్భంగా.. శుక్రవారం అంగన్వాడికి సెంటర్ లో గర్భవతులకు, బాలింతలకు, చిన్నారులకు, రక్తహీనత పరీక్ష, నిర్వహించారు. వారికి తగు సూచనలు అందించి, పౌష్టికాహారం యొక్క ఆవశ్యకతను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ లూధియా, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు.