వెల్దుర్తి: ఘనంగా జ్వాలా తోరణం
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామం అతి పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా శుక్రవారం రాత్రి 60 అడుగుల జ్వాలా తోరణం నిర్వహించారు. భక్తులు అందరూ శివ నామ స్మరణతో శివుని దర్శనం అనంతరం జ్వాలా తోరణం కింద నుండి వెళ్లడం జరిగింది. అనంతరం భక్తులకు పులిహోర ప్రసాదం అందించారు.