పెదకూరపాడు మండలంలోని జలాల్పురం గ్రామంలో భూ సమస్యలపై 77 దరఖాస్తులు వచ్చాయని పెదకూరపాడు మండల తహసిల్దార్ దానియేలు ప్రకటనలో తెలిపారు. గురువారం రీసర్వే సమస్యలపై జలాల్పురంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ దరఖాస్తుల ద్వారా వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.