కృష్ణానది నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సోమవారం అమరావతి సీఐ శ్రీనివాసరావు కోరారు. మూడవ నంబర్ హెచ్చరిక వచ్చిందని పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు త్వరగా ఇల్లు ఖాళీ చేసి ప్రభుత్వ ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సిఐ కోరారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న ప్రతి ఒక్కరికి మౌలిక సదుపాయాలు కల్పించామని సత్వరమే ఇల్లు ఖాళీ చేసి పునరావస కేంద్రాలకు వెళ్లాలన్నారు.