పులిచింతల నుంచి 5,43,617 క్యూసెక్కుల విడుదల

76చూసినవారు
అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు వరద ప్రవాహం స్థిరంగా ఉంది. సోమవారం రాత్రి 7 గంటలకు 21 రేడియల్ గేట్లు తెరిచి దిగువ ప్రకాశం బ్యారేజికి 5,43,617 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు డీఈఈ అరుణకుమారి తెలిపారు. ఎగువ నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతం నుంచి అంతే మొత్తం వరద నీరు వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టులో 41. 93 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

సంబంధిత పోస్ట్