ప్రతి నెల 9న గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు

83చూసినవారు
పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో.. ప్రతి నెల 9వ తేదీన గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సోమవారం డాక్టర్ ఆదిత్య తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం ద్వారా గైనకాలజిస్ట్ సూచనతో ప్రత్యేక వైద్య పరీక్ష నిర్వహిస్తారని ఆయన తెలిపారు. వైద్య పరీక్షల ద్వారా తల్లి బిడ్డ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు గుర్తించవచ్చని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్