ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వ పాలనపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన విమర్శించారు. నా బీసీ, నా ఎస్టీ, నా ఎస్సీ అంటూనే దళితులను నిండా ముంచారని మండిపడ్డారు. ఈ క్రమంలో గత టీడీపీ హయాంతో పోలిస్తే వైసీపీ పాలనలో దళితులపై దాడులు 10 రెట్లు పెరిగాయని మంత్రి లోకేష్ ఆరోపించారు.