భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

77చూసినవారు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లకు పన్ను మినహాయింపు ప్రకటించడం మార్కెట్ లాభాలకు కారణమైంది. సెన్సెక్స్ 1,577.63 పాయింట్లు పెరిగి 76,734.89 వద్ద, నిఫ్టీ 500 పాయింట్లు లాభపడి 23,328.55 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, L&T, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా మోటార్స్ షేర్లు లాభపడగా, ITC, HUL షేర్లు నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్