పట్టణం శుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం బొబ్బిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పలువురు పారిశుధ్య కార్మికులకు రక్షణ సామగ్రిని అందజేశారు. అనంతరం సఫాయి మిత్ర, సురక్ష కింద కార్మికులకు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణాంలో 150 కుటుంబాలు ఉన్నట్లు మున్సిపల్ కమీషనర్ తెలిపారు.