కొత్తవలస మండలం మంగళపాలెంలో గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ వై.ఎస్.ఆర్. శర్మ, హాస్యభ్రహ్మ శంకరనారాయణలచే పదిమంది దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు ట్రస్ట్ సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ డా. వి. ఫణీంద్ర, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.