గరివిడి: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

51చూసినవారు
గరివిడి: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గరివిడి ఐసిడిఎస్ పిఓ ఆరుద్ర కోరారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద బాల్య వివాహ ముక్తాభారత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. బాల్య వివాహాల నిరోధక చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎంపీడీవో శేషుబాబు, తాసిల్దార్ ఆదిలక్ష్మి, ఏ పీ ఎం భారతి, ఎంఈఓ భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్