గుర్ల పోలీసు స్టేషను పరిధిలో సిబ్బందితో మంగళవారం ఆకస్మిక దాడులు చేపట్టగా కోటగండ్రేడు గ్రామంలో గొలుసు దుకాణం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి 290 మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు ఎస్ఐ పి. నారాయణరావు తెలిపారు. గ్రామాల్లో గొలుసు దుకాణం నిర్వహించిన, అక్రమ మద్యం బాటిళ్లు లభ్యమైన, నాటుసారా తయారు చేసిన ఉపేక్షించబోమని హెచ్చరించారు.