మెరకముడిదాం మండలం గర్భాం యువ గణేష్ సేవా సంఘం ఆధ్వర్యంలో పంచముఖి ఆంజనేయ కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం సుమారు 200 మందితో సహస్ర కుంకుమర్చాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యువ గణేష్ సంఘ సభ్యులు, వేద పండితులు ఆరవల్లి గణపతి శర్మ సమక్షంలో భక్తులు గానానాధునికి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.